Home News మహిళాభ్యుదయానికి పునాది వేసిన రాజ్యాంగం – డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి

మహిళాభ్యుదయానికి పునాది వేసిన రాజ్యాంగం – డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి

0

మహిళాభ్యుదయానికి పునాది వేసిన రాజ్యాంగం
– డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి

గుంటూరు (జయ జయహే): భారత రాజ్యాంగం భారతీయ మహిళలకు రక్షణ కల్పిస్తూ వారి అభ్యున్నతికి పునాది వేసిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఈనెల 26వ తేదీన గుంటూరులోని ప్రభుత్వ మహిళ కళాశాలలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవ సభకు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా|| వి.ఆర్. జోత్స్న కుమారి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ 1951 లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలు, దళితులు, గిరిజనులు, వికలాంగులు, బలహీన వర్గాల వారికి రక్షణ కల్పించడం ద్వారా కోట్లాదిమంది నిస్సహాయులకు ఆదరణ లభించిందన్నారు. దేశభక్తి అంటే ముస్లిం లను ముస్లిం దేశాలను విమర్శించడం కాదని, దేశంలో ఉన్న భారతీయులందరినీ కుల, మత, లింగ భేదాలకు అతీతంగా సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేయడమేనని మన రాజ్యాంగం స్పష్ట పరిచిందని వివరించారు.. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం సజీవ పత్రం అని, భారత సమాజంలో మార్పులకు అనుగుణంగా 105 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగి సుమున్నాతంగా నిలిచిందన్నారు. భారత రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న సామ్యవాద, లౌకిక, సమగ్రతలను కాపాడుకోవడానికి కృషి జరగాలన్నారు. 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు తర్వాత భారతదేశం జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకున్నామని, మిగిలిన అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నామని వివరించారు. భారత్ తోపాటు స్వాతంత్ర్యం పొందిన చైనా తలసరి ఆదాయం మనకన్నా 6 రెట్లు అధికంగా ఉందన్నారు. భారతదేశం సగర్వంగా ప్రపంచంలో అత్యున్నత స్థితికి చేరుకోవాలంటే అసమానతలు, పేదరికం, మూఢనమ్మకాలు తగ్గాలని కోరారు. వస్తుందని, వే. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కె. సతీష్ రాజ్యాంగ పీఠికను విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు. 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన,వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు బి. లలిత బాబు, బి. క్యూరీ, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, మానవత సభ్యులు బాలకృష్ణ చౌదరి, చావా శివాజీ, చావా లక్ష్మి సామ్రాజ్యం, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, మహిళా కళాశాల సిబ్బంది దాదాపు 300 మంది విద్యార్థినిలు పాల్గొని ప్రసంగించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version