Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఈనెల 22న సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలి

ఈనెల 22న సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలి

ఈనెల 22న విశాఖలో జరుగుతున్న సాగర సంగ్రామ దీక్షని విజయవంతం చేయాలని ఎపిటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమరాన త్రినాథ్ కోరారు. మంగళవారం బుచ్చయ్యపేటలో సాగర సంగ్రామ దీక్ష పోస్టర్ను విడుదల చేశారు.8సంవత్సరాలుగా సిపిఎస్ రద్దుకై ఉపాధ్యాయులు,ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సీపీఎస్ ను రద్దు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిపిఎస్ ని రద్దుచేసి ఒపీఎస్ ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాద్, ఏపీసిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్, మండల శాఖ అధ్యక్షులు శేషు, ప్రధాన కార్యదర్శి మధు కృష్ణ, జిల్లా సబ్ కమిటీ సభ్యులు బి.దేముడు బాబు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments