అనకాపల్లి జయ జయహే :
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలంటూ బుధవారం అనకాపల్లిలో జర్నలిస్టుల సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నవంబర్ 26 దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో జర్నలిస్టులు కూడా సంఘీభావం తెలుపుతూ స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రద్దు చేసిన చట్టాలలో వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్ 1955, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1958 జర్నలిస్టులకు సంబంధించినవి జర్నలిస్టుల స్థితిగతులు జీతభత్యాలు ఇతర సదుపాయాలు గురించి ఈ చట్టాలు ప్రస్తావిస్తాయి. వీటి రద్దుతో జర్నలిస్టులు ఉనికే ప్రమాదం ఏర్పడిందని అని రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించకుంటే ఆందోళన కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తామని జర్నలిస్టు సంఘాలు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డి వెంకటేష్ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి కే గణేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు వై నాగు, సురేష్ కోన లక్ష్మణ్, సంజీవ్, బి అప్పారావు, గోపాలరావు, దేవుడు బాబు పాత్రికేయల బృందం తదితరులు పాల్గొన్నారు.
రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలు పునరుద్ధరణ చెయ్యాలి
RELATED ARTICLES
