Monday, June 29, 2026
HomePoliticsAndhra Pradeshపోలీసులు మీ స్నేహితులు

పోలీసులు మీ స్నేహితులు

మారేడుమిల్లి సిఐ టిజిఎన్ ప్రసాద్ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడవద్దని గిరిజనులకు సిఐ టిజిఎన్ ప్రసాద్ సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా బుధవారం గుర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవడికోట గ్రామంలో సిఐ ప్రసాద్ , సిబ్బందితో కలిసి పర్యటించి గిరిజన ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ టిజిఎన్ ప్రసాద్ స్వయంగా గిరిజన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు ,చట్ట విరోధమైన పనులకు పాల్పడవద్దని గ్రామస్థులకు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల గ్రామస్థులకు అప్రమత్తం చేశారు. అలాగే గంజాయి సాగు , రవాణా,వినియోగించిన కఠినమైన శిక్షలు ఉన్నాయని వాటి వలన కలిగే నష్టాల గురించి యువతకు అవగాహన కల్పించారు. పోలీసులు మీ స్నేహితులుగా భావించాలని ఏదైనా సమస్య వచ్చిన భయం లేకుండా పోలీసులను ఆశ్రయించవచ్చని చెప్పారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు.అనంతరం రేవడికోట గ్రామ యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గుర్తేడు ఎస్ఐ రాజ్ కోటి , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments