Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరక్షణలో నేవీ కీలకం

రక్షణలో నేవీ కీలకం

సుమద్ర వాణిజ్యంలో సుస్థిరత

రాష్ట్రపతి ద్రౌపది మర్ము వెల్లడి

ఐఎన్ ఎస్ సుమేథ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతోపాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని.. ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు.
నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధనా నౌకలు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments