Home Devotional అత్యంత వైభవంగా జరిగిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

అత్యంత వైభవంగా జరిగిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

0

అనకాపల్లి జయ జయహే
స్థానిక గవరపాలెం అగ్గిమరిచెట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సర్వకామ దాంబ సమేత బోగలింగేశ్వర స్వామి దేవాలయంలో నెలకొల్ప బడి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారికి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు భస్మాభిషేకం,గంధభిషేకం, గంగాభిషేకం, పలు రకాల పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామి వారికి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో బుద్ధ శివాజీ కుటుంబ సభ్యులు ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి అభిషేకాలతో ఆలయ ప్రాంగణం కోలాహలంతో నిండిపోయింది. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు స్వామివారి అన్న తీర్థ ప్రసాదములు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బుద్ధ శివాజీ కుటుంబ సభ్యులు వితరణ చేయడం జరిగింది. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ వారి పాలకవర్గ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version