Home News వాసుపల్లి సమక్షం లో వైసిపిలో చేరిన క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్

వాసుపల్లి సమక్షం లో వైసిపిలో చేరిన క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్

0

 

•⁠ ⁠కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వాసుపల్లి

విశాఖపట్నం (జయ జయహే) క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి చెందిన సొండి సుధాకర్ బాబు బుధవారం దక్షిణ వైయస్సార్సీపీలోకి చేరారు. 32 వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో చేరిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర నిరాశతో వైసీపీలో చేరానని సుధాకర్ బాబు తెలిపారు. వైయస్ఆర్సీపీ హయాంలో క్రిస్టియన్ మైనార్టీతో భాగానికి సమచిత స్థానం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం మళ్లీ ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. అటువంటి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన దక్షిణంలో ఒకే ఒక్క నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అని, ఆయన చేస్తున్న సేవలు క్యాడర్కు ఇచ్చే గుర్తింపు తనని వైసీపీలో చేరేలా చేశాయన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో చేరినందుకు రాజారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్టియన్ మైనార్టీ సమస్యల పట్ల పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ మహిళా అధ్యక్షురాలు వాసుపల్లి బంగారమ్మ, సౌత్ అంగన్వాడీ ప్రెసిడెంట్ కొణతాల కృష్ణవేణి, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version