- అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తి చెయ్యాలి..
- గిరిజన మహిళ సంఘం మండల అధ్యక్షురాలు, కాసులమ్మ స్వాభి
- అనంతగిరి,జయ జయహే:
అసంపూర్తిగా ఉన్న కితలంగి అంగన్వాడీ భవనాన్ని పూర్తిచేయాలని గిరిజన మహిళ సంఘం మండల అధ్యక్షురాలు కాసులమ్మ స్వాభి డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అనంతగిరి మండలం, కోనాపురం గ్రామ పంచాయతీ కేంద్రంలో 2015సంవత్సరంలో భవన నిర్మాణం పని మొదలు పెట్టి నేటి టివరకు పూర్తి చేయకపోవడం దారుణమని ఆమె తెలిపారు. గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు రూ.12లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు వచ్చాయన్నారు. అ నిధులు పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరు అయిందని అయితే భవన నిర్మాణం పూర్తి చేయకుండా గుత్తేదారు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసారని అన్నారు.దింతో అంగన్వాడి కేంద్రంలో ఉండవలసిన పిల్లలు అద్దె భవనంలో ఉంటున్నారని అన్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్,ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిణి,సంబంధిత అధికారులు చొరవతీసుకొని అంగన్వాడి కేంద్రం నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాన్ని పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
