Home Politics Andhra Pradesh తెలుగువారి స్ఫూర్తిదాత అమరజీవి పొట్టి శ్రీరాములు

తెలుగువారి స్ఫూర్తిదాత అమరజీవి పొట్టి శ్రీరాములు

0

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి టౌన్ అడ్మిన్ ఏజీఎం ఓంకార్ భోయ్, టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ గజమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ శ్రీరాములు భాషా ప్రతిపాదిక మీద తెలుగువారందరికీ ప్రత్యేక రాష్ట్రం కేటాయించాలని 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన పిదప అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కలుగజేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం జరిగిందని . ఆ మహానుభావుని భావి తరాల యువతరానికి స్ఫూర్తిగా కుటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గతంలో నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఉక్కునగరం వాసవి క్లబ్ వాసవి అసోసియేషన్ కె వీర్రాజు వాసవి అసోసియేషన్ ప్రతినిధులు డి సోంబాబు, వి బిక్షపతి, ఏ ఆర్ కె మూర్తి, సిహెచ్ వి ఎస్ ఎన్ మూర్తి, ఎం వివిఎస్ మూర్తి మరియు ఉక్కు కార్మికులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version