Home Politics Andhra Pradesh ఆధునిక యుగానికి సాంకేతికత అవసరం

ఆధునిక యుగానికి సాంకేతికత అవసరం

0

విద్యార్థుల నైపుణ్యమే ఉజ్వల భవిష్యత్తు

ఆధునిక యుగములో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మేలైన సాంకేతిక నైపుణ్యాలు చాలా అవసరం అని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు.

కృత్రిమ మేధస్సు, యంత్రభ్యాసం, ఆధునిక సాంకేతిక అంశాలపై విద్యార్థులు ఎంతో అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు, వేగంగా పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యాలు డిమాండ్ ను ప్రతి విద్యార్థి దృష్టిలో ఉంచుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ ఐ ఓ టి డెవలప్మెంట్ ప్రాక్టికల్ గైడ్ పుస్తకం కళాశాల డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవిష్కరించారు.

ఈ పుస్తక రచయితలు ఐతం కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్ల విభాగానికి చెందిన అధ్యాపకులు గొల్లపల్లి సాయి తేజస్వి, చుండూరు అనిల్ కుమార్, సుఖేష్, ప్రభాకర్, సంయుక్తంగా రచించిన ఈ పుస్తకం రాబోవు తరానికి మార్గ దర్శినిగా ఉపకరిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాసరావు, అకాడమిక్ డీన్ డాక్టర్ డి శ్రీరాములు, డాక్టర్ పి నరేష్ డాక్టర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version