Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshపెన్షన్లు పంపిణీ చేసిన గంటా

పెన్షన్లు పంపిణీ చేసిన గంటా

జీవీఎంసీ 6 వ వార్డు పరిధిలోని లక్ష్మీవానిపాలెంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 63 లక్షల మందికి ప్రతినెల రూ.2,800 కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఈ నెలలో 8 వేల మందికి స్పౌజ్ పెన్షన్లు కింద రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు. పెన్షన్ల సహా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గరే గుర్నాథ్, దాసరి శ్రీనివాస్, యార్లగడ్డ జీవన్ కుమార్, మన్యాల సోంబాబు, మొల్లి లక్ష్మణరావు, లొడగల జానకిరామ్, నాగోతి సత్యనారాయణ, మామిడి దుర్గారావు, పోతిన ప్రసాద్, కె.అచ్యుతరావు, సంతోష్ నాయుడు, కృష్ణయ్య, పి. నాగేశ్వరరావు, వరప్రసాద్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments