Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గంటా

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గంటా

జీవీఎంసీ 3 వ వార్డు పరిధిలో రూ.1.27 కోట్ల విలువైన అబ్బివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.42 లక్షలతో ఆధునికీకరించిన కృష్ణా నగర్ కమ్యూనిటీ హాల్ కు ప్రారంభోత్సవం చేశారు. నేరళ్లవలస కాలనీ, ఎగువ పేట, గొల్లలపాలెం, అప్పికొండ వారి వీధి, కృష్ణ కాలనీ, నల్లి వీధి తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్ల తదితర పనులను చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి జీవీఎంసీ వార్డులో రూ. 15 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నాగేంద్ర, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, గాడు చిన్ని కుమారి లక్ష్మి, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments