Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshజీడీ పంటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వ మే కోనుగోలు చేయాలి

జీడీ పంటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వ మే కోనుగోలు చేయాలి

జీడీ పిక్కలకు కేజీ రెండు వందలు రూపాయలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వ మే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కోనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇ నరసింహమూర్తి, కె భవానీ డిమాండ్ చేసారు. బుధవారం శంకరం పంచాయతీ లో విస్రుతంగా పర్యాటించి గిరిజన జీడీ రైతులు సమస్యలు అడిగి తెలుసుకుని జీడీ తోటలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రతి సంవ త్సరం,జీడి పంటకు గిట్టు బాటు ధర లేక గిరిజన రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వరి,చెరకు,పత్తి మొదలగు పంటలకు మద్దతు ధర ప్రక టిస్తుందని.కాని జీడి పంటకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం లేదన్నారు మార్కెట్ సౌకర్యం కల్పించక పోవడం ధర కూడా నిల కడగా ఉండక పోవడం జీడి పిక్కల పంట సమయంలో వ్యాపారులు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు వ్యాపారుల చేతికి జీడిపిక్కలు చేరిన తరువాత ఆమాంతంగా జీడి ధర పెరుగు పోతుందని తెలిపారు.రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్ట పోతున్నారని అవేదన వ్యక్తం చేసారు.జీడి పిక్కల ధర ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్ణయించి అమలు చేయక పోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని తెలిపారు.జీడి రైతులను మోసగి స్తున్నారని తెలిపారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments