Home Politics Andhra Pradesh 2030 నాటికి టీబీ నివారణ లక్ష్యం

2030 నాటికి టీబీ నివారణ లక్ష్యం

0

ఎమ్మెల్యే కె ఎస్ ఎన్

రానున్న 2030 నాటికి దేశవ్యాప్తంగా క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తగు కృషి చేస్తామని ఆ దిశగా ప్రతి ఏడాది మార్చి 23న క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు చెప్పారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ సందర్భంగా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆసుపత్రి కమిటీ చైర్మన్ దేవరపల్లి వెంకట అప్పారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీభీ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా టీబీ వ్యతిరేక నినాదాలు చేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించేందుకు సంపూర్ణ ఆరోగ్యం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ కళాశాల విద్యార్థులు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది, టీవీ యూనిట్, ఐ సి టి సి సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version