Home Politics Andhra Pradesh ఈనెల 25న అచ్యుతాపురం లో జాబ్ మేళా

ఈనెల 25న అచ్యుతాపురం లో జాబ్ మేళా

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా అచ్యుతాపురం ఏ పీ ఐ ఐ సి, వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ సజ్జలో సుమారు 15 బహుళజాతీయ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఎన్. గోవింద రావు సోమవారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి,ఐ టి ఐ, డిప్లొమా, డిగ్రీ, పి జి వరకు చదువుకొని 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిని నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరములను నైపుణ్యం. ఏపీ.జిఓవి.ఐఎన్ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, అడ్మిట్ కార్డు తో పాటుగా ఎక్కువ రెస్యూమేలు, ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు జెరాక్స్ లతో జాబ్ మేళా జరుగు ప్రదేశానికి ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరముల 81425 65416 నంబర్లను సంప్రదించగలరు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version