నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ సోమవారం జరిగిన స్టేట్ బ్యాంక్ శంకుస్థాపన కార్యక్రమానికి మాడుగుల మండలం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో మాడుగుల, ఎం కోడూరు, పొంగలిపాక, కింతలి వల్లపురం, ఒమ్మలి, కృష్ణాపురం తదితర గ్రామాల నుండి ప్రత్యేక బస్సుల్లో కూటమి కార్యకర్తలు నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి అప్పల్రాజు, జిల్లా టిడిపి ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండూరు దేముడు, మండల పార్టీ అధ్యక్షులు ఎన్ సన్యాసిరావు, పి రమేష్, మాడుగుల పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మీనారాయణ, పొంగలిపాక సర్పంచ్ నాయన సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు శెట్టి సత్తిబాబు,, పాల సొసైటీ అధ్యక్షుడు నాయన జోగినాయుడు, నీటి సంఘం అధ్యక్షుడు బంటు మల్లు నాయుడు, ఎక్స్ ఎంపీటీసీ పల్లికల దేవుడు, గ్రామ పెద్ద ఎర్ర సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులో ఏ ఒక్కరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుకొని ఉండేందుకు ఆరోగ్య సిబ్బంది కావలసిన మందులను అందజేశారు.
