Home Politics Andhra Pradesh ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చాలి

ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చాలి

0

తహసిల్దార్ ఆఫీస్ వద్ద రైతు సంఘం ధర్నా దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పిడి చేయకుండా యధావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి కొల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు పథకాల పేర్లను మార్పులు చేస్తున్నారని విమర్శించారు, కార్మికులు కూలీల హక్కులను హరిస్తున్నారని కార్పొరేట్ శక్తులకు కంపెనీలకు దేశ సంపదను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు, ఈ మేరకు ధర్నా నిర్వహించారు టెక్కలి ఉపతహసిల్దార్ రవికుమార్ కు సంఘం తరఫున మెమోరాండం అందజేశారు, ఈ కార్యక్రమంలో బ గాది వాసుదేవరావు కే శ్రీకాంత్, వి పోలయ్య, యు లక్ష్మణరావు, భీమారావు, కొల్లి రామారావు, టి అప్పన్న, సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version