విశాఖ జనసేన పార్టీ అధ్యక్షులు,దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సర్వ మత పెద్దలు ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే వంశీకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా అనాధ ఆశ్రమం మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ లలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేసారు
ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజానాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దక్షిణ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నికై ప్రజలందరి మనల్ని పొంది వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటూ ప్రజల మనస్సును గెలిచారాని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు