Home Politics Andhra Pradesh కనుమరుగులో మడ అడవులు

కనుమరుగులో మడ అడవులు

0

జీవరాసుల మునుగడకు ముప్పు పరిరక్షణ లేక పతనo దిశగా తీర ప్రాంతం సుదీర్ఘకాలంగా తీర ప్రాంతంలో ప్రజలు ఆరోగ్యo పచ్చదనం ఆహారం జీవరాసులు మనుగడ కు ప్రకృతిలో భాగమైన మడ అడవులు రానున్న కాలానికి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణహిత వరులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతిని పెనుమార్పులను ప్రజలు చూస్తున్నారు, వాతావరణ పరిస్థితుల వల్ల భారీ తుఫాన్లు వరదలు, కొంతమంది స్వార్థపరుల స్వలాభం కోసం రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా పెరుగుతున్న ఆక్వా చెరువుల సాగుబడి విపరీతంగా పెరగడంతో తీర ప్రాంతం కబ్జా తో పాటు పూర్వం నుంచి ప్రకృతి వలయంగా ఉన్న మడ అడవులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. రాష్ట్రంలో 1052 కిలోమీటర్లు మడ అడవులు ఉప్పుకమతాలపై ఆధారపడి పెరుగుతున్నాయి. జీవరాసులైన జంతువులు పక్షులు క్రిమి కీటకాల జీవన వైవిధ్యం అందిస్తున్న మడ అడవులు దేశంలో ఆదరణ కరువై ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు లేకపోవడం , నిరాధారణకు గురవుతున్న తీర ప్రాంత భూములు నదుల నీటి పరివాహక మడ అడవులు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. ఈ భూములకు ప్రభుత్వ రక్షణ చాలా అవసరం. సరుగుడు తోటలు ఏపుగా పెరిగినప్పటికీ తీర ప్రాంతం వానలు వరదలకు చాలా ప్రాంతం కోతకి గురై చాలా ఆందోళనకు గురిచేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతంలోని కళింగపట్నం, గార,పోలాకి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, వజ్రపు కొత్తూరు, పలాస, మందస, కవిటి, ఇచ్చాపురం తీర ప్రాంతాల ను ఆనుకుని ఉన్న వేలాది ఎకరాల మడ అడవుల భూములు, వర్షాధారo స్థానిక జీవనదుల ఆధారీ తంగా పచ్చగా ఏపుగా పెరిగి జీవరాసుల మనుగడకు మేలు చేస్తున్న మడ అడవులు మరికొన్నాళ్ళకు కనుమరుగయ్యే ప్రమాదాలు దాపురించి ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు సమగ్రమైన కార్యాచరణ చేసి తీర ప్రాంతాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకొని దురాక్రమణాలకు గురవుతున్న ఈ భూములు మడ అడవుల ను రక్షించాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version