ఎమ్మెల్యే బండారు
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఇల్లు నిర్మించే సహకారం నెరవేరుతుందని మాడుగ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. సోమవారం మాడుగుల మండలం వీర నారాయణం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంజూరు చేసి నిర్మించిన ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకి తాళం చెవి అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదవారి కి అండగా నిలుస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎల్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు కూడా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి అప్పలరాజు, కూటమి నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు
