జిల్లా వైయస్ ఆర్ సీ పీ అధికార ప్రతినిధి కూడా. సురేష్ కుమార్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయం చేస్తున్న పార్టీ కేవలం కూటమి ప్రభుత్వమని అని వైయస్ ఆర్ సీ పీ జిల్లా అధికార ప్రతినిధి కూడా. సురేష్ కుమార్ అన్నారు. రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది భక్తుల మనోభావాలతో రాజకీయం చేయటం “తిరుమల తిరుపతి దేవస్ధానం లడ్డూలో జంతువుల కొవ్వు” కలిసిందని ఆధారాలు లేని నిందారోపణలు చేయటంతో తన రాజకీయ కుట్రకు నాంధి పలికారన్నారు. గత జూలై నెలలో ఎన్. డీ. డీ. బీ ఇచ్చిన మొదటి నివేదికలో లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్తూ, సందేహాలుంటే మరలా పరీక్షించవచ్చని చెప్పింది. సీ. బి. ఐ. కూడా లడ్డూలో జంతుకొవ్వు, పందికొవ్వు, గొడ్డు కొవ్వు కల్తీ జరుగలేదని నిర్ధారించింది.
దేశంలో అత్యున్నత మెడికల్ ల్యాబ్ లు నిర్ధారించినప్పటికీ తమ మోజేతి నీరుతాగే చెంచా నాయకుల చేత లడ్డూలో కల్తీ జరిగిందని, ఘోరం జరిగిపోయిందని ప్రచారం చేయడం కూటమి పార్టీల పతనానికి పరాకాష్ఠ అని ఆయన నిప్పులు చెరిగారు
ఒక పాస్టర్ చనిపోతే ఆ పాస్టర్ ని కించపరుస్తూ హైదరాబాద్ లో ఉంటాడు రాజమండ్రి వెళుతున్నాడు రాజమండ్రి చేరుకునే ముందు దారి మొత్తం తాగుతూ, తూలుతూ, ఎక్కడికక్కడ పడుతూ చనిపోయే పరిస్ధితికి వచ్చాడని వెకిలిగా మాట్లాడుతూ పాస్టర్ ని, క్రిష్టియన్ సమాజాన్నీ సైతం కించపరిచిన సంగతిని క్రిష్టియన్ సమాజం మర్చిపోలేదన్నారు. ఇంత దారుణమైన రాజకీయాలు చేయడం తెలుగుదేశం_కూటమి పార్టీలకూ నాయకులకూ తగదని ప్రజలకు వెంటనే క్షమాపణ కోరి ప్రాయచ్చిత్తం చేసుకోకపోతే మీ పార్టీలను రాబోవు ఎలక్షన్లలో కూకటి వేళ్ళతో పెకలించటం ఖాయం అని హెచ్చరించారు.
