మంత్రి లోకేష్ ను విమర్శించే స్థాయి కోడిగుడ్డు మంత్రికి లేదు వైసీపీ ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ వైసీపీ హయాంలో పదేళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటంతో తట్టుకోలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా ఎన్ని ఐటీ సంస్థలు, ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చారనేది కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో దావోస్ వెళ్ళి ఎన్ని పరిశ్రమలు, ఎంత మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని, అనేక ఐటీ సంస్థలు విశాఖ లో పెట్టుబడులు పెట్టీ, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకమేనన్నారు. వైసీపీ హయాంలో పెట్టుబడులు సున్నా అని, పలు పరిశ్రమలను బయటకు పంపించిన ఘనత మీదే అని విమర్శించారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువస్తున్నారని, 2029 నాటికి రూ.10 లక్షల కోట్లు మేర పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో దావోస్ లో మైనస్ డిగ్రీల చలి ఉంటుందని కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని, ఆయన మరిచిపోయినా, గూగుల్ లో చూస్తే తెలుస్తోందని ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శలు చేయకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూడాలని కోరారు.
రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు తేవటమే కూటమి లక్ష్యం
RELATED ARTICLES
