మహమ్మద్ ఇక్బాల్ డిమాండ్!
ఆచంట మండలంలో ఒక గ్రామానికి చెందిన 7 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వెలగన వెంకటస్వామి(75) ఈనెల ఆరవ తేదీన అత్యాచారానికి పాల్పడ్డ ఘటన తెలిసిందే. ఈ విషయమై మానవ హక్కుల వేదిక ముగ్గురు సభ్యుల బృందం ఏప్రిల్,9 న బాలిక తల్లిదండ్రులను ఆ గ్రామ ప్రజలను కలిసి నిజనిద్దారణ చేపట్టింది.నిందితుని బంధువులు బెదిరింపులకు దిగి తమను వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వేదిక సభలు వద్ద వాపోయారు. ఘటన జరిగి మూడు రోజులు అయినా ఇంత వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్ తప్పు పట్టారు.ఈ మధ్యకాలంలో ఉమ్మడి గోదావరి జిల్లాలలో మైనరు బాలికలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం అని ఆయన అన్నారు. పోలీసులు చట్ట పరంగా సరైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని ఆయన ఆరోపింఛారు.ఈ ఘటనలో బాధితురాలికి చట్టపరంగా అందవలసిన పరిహారం ప్రభుత్వం వెంటనే అందించాలని ఇక్బాల్ డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం సామాజికంగా,ఆర్థికంగా బలహీనమైనది. కావున వారికి అన్ని విధాల రక్షణ ప్రభుత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు
ఈ మధ్యకాలం లో ఆర్థికం గా సామాజికం గా వెనుకబడిన వారి పై ఈ తరహా దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిడితులపట్ల పోలీసుల వైఫల్యం వలనే ఉమ్మడి గోదావరి జిల్లాలలో పోక్సో నేరాలు పెరిగిపోయాయని, ఇటువంటి నేరాలలో స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేస్తున్నారని అది తగదని ఆయన అన్నారు.
ఈ నిజనిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
