Home News ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం చోడవరం నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం సర్వతో ముఖ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. నేపథ్యంలో ప్రతి కార్యకర్త సైనికుడు లా పనిచేసే రానున్న రోజుల్లో పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గూనూరు మల్లు నాయుడు, కే మచ్చిరాజు, జీవి సత్యనారాయణ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version