Sunday, April 26, 2026
HomeNewsఅభివృద్ధి పనులను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు

అభివృద్ధి పనులను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు

 

మాడుగుల ఫిబ్రవరి 19, జయ జయహే

మాడుగుల లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ పనులన్నీ చక్కగా సాగుతున్నాయని త్వరలో పూర్తికాగా ఉన్నారు. ఈ సందర్భంగా మాడుల పట్టణ పార్టీ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, 38 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మాడుగుల జిల్లా పరిషత్ బాలిగొన్నంత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్మాణం చివరి దశలో ఉందని మరో నాలుగైదు రోజుల్లో పూర్తి కాగలదన్నారు. అలాగే మాడుగుల నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని, డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ముందడుగు వేస్తుందన్నారు. ఈ సందర్భంగా
జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసి పిల్లల్ని భోజనం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల హెడ్మాస్టర్ హిమబిందు నీ మధ్యాహ్నం భోజనం పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ నాయకులు కే నానాజీ, ఎర్రంశెట్టి ప్రసాద్, మస్తాన్, జొన్నపల్లి రమేష్, బాలు, కే శంకర్ (జనసేన) పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments