Saturday, March 7, 2026
HomePoliticsAndhra Pradeshటెక్కలి రైల్వే గేట్ తెంబూరు జంక్షన్ జామ్

టెక్కలి రైల్వే గేట్ తెంబూరు జంక్షన్ జామ్

నిత్యం వాహనాలరద్దీతో ఈ రోడ్డులో ఇక్కట్లు టెక్కలి ప్రధాన కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే గేట్, తెంబూరు రోడ్డు, జిల్లా ఆసుపత్రికి వెళ్లి రహదారి నిత్యం వాహనాల రద్దీతో పాద చారులను వాహనదారులు, బస్సులు, లారీలు, ఆటోలు మోటార్ సైకిల్ తో ఈ జంక్షన్ వచ్చేసరికి ప్రజలకు రద్దీ రాజ్యమేలుతోంది, కనీసం తప్పుకోవడానికి వీలు లేకుండా ఎక్కడబడితే అక్కడ వాహనాలు ఆపి రోడ్డుపైనే పార్కింగ్లో పెట్టి సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు, ఉన్నతాధికారులు ట్రాఫిక్ జామ్ తక్షణమే పరిష్కారం చేసి ప్రజా ఇబ్బందులను తగ్గించాలని పలువురు ఆశిస్తున్నారు.

ప్రభుత్వ శాఖల అలసత్వం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ తో నరకం తప్పే మార్గం లేదు, పలాస, నౌపడ, మెలియాపుట్టి, పాతపట్నం శ్రీకాకుళం, కోటబొమ్మాలి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు, రిక్షాలు, తోడు కావడంతో ఈ జంక్షన్ వచ్చేసరికి ప్రజలకు , పాదచారులకు కష్టాలు మొదలవుతున్నాయి, ఇక్కడ ప్రత్యేకమైన పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే గాని ఈ బాధలు తప్పవని జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ లింగరాజు, టెక్కలి అభివృద్ధి కమిటీ, సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments