ఆరు కోట్లతో నౌపడ మెలియాపుట్టి రోడ్ నిర్మాణం టెక్కలి నియోజకవర్గం పరిధిలో శాశ్విత రహదారులు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు.
టెక్కలి మండలం డమర గ్రామం వద్ద ఆరు కోట్ల రహదారికి గాను మంత్రి శంకుస్థాపన చేశారు త్వరితగతిగా బీటీ రోడ్ల నిర్మాణం చేసి ప్రజా రవాణా అవసరాలు తీర్చాలని అధికారులకు ఆయన సూచించారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలకు సమగ్ర ప్రణాళికతో రహదారులకు మోక్షం కలుగుతుందని ప్రజా రవాణా సౌకర్యానికి తగిన రహదారులు నిర్మిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
.
