Home News ఘనంగా ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం

ఘనంగా ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం

0

పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమం అనకాపల్లి జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, చినముసిడివాడ గౌరి సంక్షేమ సంఘం భవనం లో 95, 97 వార్డుల బిజెపి మండల అధ్యక్షులు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో 2వ రోజు ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అదితి గా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్, ఓ బి సి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రశిక్షణ మహా అభియాన్ రీజినల్ కో- అర్డినేటర్ రొంగలి గోపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ భారత్ మాతాకి జై గురించి వివరించి అఖండ భారతదేశం యొక్క విభిన్న సంస్కృతుల సంప్రదాయాలు గురించి, వివిధ రాజ్యాలు, రాజుల వ్యవస్థ గురించి ,ఆచార వ్యవహారాలపై వివరించారు. ఈ కార్యక్రమం లో అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పుట్టా గంగయ్య, కర్రి రామకృష్ణ, పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, 95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు,గాది శ్రీనివాసరావు, పట్టాభి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు, మండల పదాధికారులు, మహిళలు తో పాటు 120 మంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version