Home News యువతి అనుమానాస్పద మృతి

యువతి అనుమానాస్పద మృతి

0

అలబీరు జంక్షన్ వద్ద విగతజీవిగా పడి ఉన్న యువతి

గ్రామంలో విషాద ఛాయలు ,అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, మాకవరం గ్రామం సమీపంలో గల అలబీరు జంక్షన్ వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మండలంలో గల బరడ పంచాయతీ ఆడార్లాడి ముఖిపుట్టు గ్రామానికి చెందిన వనుగు త్రినాధ్ యొక్క కుమార్తె వనుగు సుమిత్ర (16) గా గుర్తించారు. మంగళవారం ఉదయం మాకవరం గ్రామ సమీపంలో గల అలబీరు వెళ్ళే జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది, రహదారి పక్కన పడి ఉన్నట్లు స్థానిక ఎస్ఐ పి నాని తెలిపారు. యువత తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగిందని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సోమవారం రాత్రి తమ కుమార్తెను ఎవరు తీసుకెళ్లారో, ఎలా అక్కడ వరకు వెళ్లింది తమకు తెలియదన్నారు. ఈ విషయం మంగళవారం ఉదయం తమకు తెలిసిందనీ, అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఆమే మరణించి ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ద్వారా తెలుసుకున్నామని, ఆమే ఎలా చనిపోయిందో తమకు తెలియదన్నారు. దీనిపై పోలీసు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఒకే ఒక కుమార్తె ఉండి మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యువతి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version