Home News నిఘా నేత్రాల నడుమ…

నిఘా నేత్రాల నడుమ…

0

విజయవంతంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు

ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహణ

రానున్న పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు

ఇంటర్మీడియట్ విద్య జిల్లా అధికారి వై. నాగేశ్వరరావు ,పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారంతో విజయవంతంగా ముగిశాయి. ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో,జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో, వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ విధ్య సిబ్బంది సమన్వయంతో ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా జరిగాయి.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు తెలిపారు.
జిల్లాలో ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలను మూడు విడతలుగా జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించగా,జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు విడతలుగా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.సైన్స్,ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని వెల్లడించారు.ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 10,026 మంది విద్యార్థులు కేటాయించబడగా, వివిధ కారణాల వల్ల సుమారు 300 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు జనరల్ ప్రాక్టికల్స్ కు 176 మoది ఎగ్జామినర్లను, ఒకేషనల్ విభాగానికి 126 మంది ఎగ్జామినర్ల సేవలు వినియోగించుకున్నట్లు అయిన తెలిపారు.ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన పరీక్షలు నిర్వహణ కమిటీ సమన్వయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించిoదన్నారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో సహకరించిన అధ్యాపకులు,సిబ్బంది, పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు డీఐఈఓ వై. నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు.సమిష్టి కృషితోనే జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో రానున్న పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు డిఐఈఓ నాగేశ్వరరావు తెలిపారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version