యలమంచిలి, జయ జయహే న్యూస్ : యలమంచిలి మండల నూతన విద్యాశాఖాధికారి గా సుసర్ల సూర్య ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మండలంలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆయనకి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల విద్యాశాఖ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కాలానుగుణంగా మారుతోన్న టెక్నాలజీని ప్రతి ఉపాధ్యాయుడు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీటియేఫ్, పిఆర్టియు, ఎస్టీయు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
