Home News పీఎం స్వానిధి రుణాలను సద్వినియోగం చేసుకోండి-కమిషనర్ ప్రసాద్ రాజు

పీఎం స్వానిధి రుణాలను సద్వినియోగం చేసుకోండి-కమిషనర్ ప్రసాద్ రాజు

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : యలమంచిలి పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో పీఎం స్వానిధి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎం స్వానిధి రుణాలను కమిషనర్ చేతుల మీదుగా బ్యాంక్ సిబ్బంది మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులందరూ పీఎం స్వానిధి స్కీములు సద్వినియోగం చేసుకుని వీధి వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అన్నారు. ఫైనాన్సు వ్యాపారుల వద్ద చీటీలు తీసుకునే పద్ధతి నుంచి విముక్తి పొంది స్కీము ద్వారా రుణాలు పొంది సక్రమంగా చెల్లింపులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో వివిధ వ్యాపారస్తులకు ఇస్తోన్న రుణాలను పదివేలనుండి 15 వేలకు, 20,000 ఇచ్చే రుణాలు 25 వేలకు పెంచడం జరిగిందని అన్నారు. కాబట్టి పెంచిన లోను వ్యాపారస్తులందరికీ అందిస్తున్నాం కాబట్టి రుణాలను తీసుకొని సక్రమంగా మరల చెల్లింపు చేసిన వెంటనే లోన్లు పొందాలని తెలిపారు. లోన్ పొందిన వారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వీరికి వడ్డీ తిరిగి చెల్లింపు చేస్తామని అన్నారు. బ్యాంకు వారు 84 మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల అరవైవేల రూపాయల రుణాలు అందజేయడం జరిగిందని సిఎంఎం పద్మావతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ బిందు, మెప్మా డీఎంసీ వరలక్ష్మి, మెప్మా సీఈవోలు, ఆర్పీలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version