- ప్రభుత్వం ఆదుకొంటుంది ఆందోళన చెందొద్దు
- పార్టీ శ్రేణులంతా అండగా ఉందాo
- బొజ్జన్నను పరామర్శించిన సురేష్ కుమార్
పాడేరు జయ జయహే: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు హయం నుండి పార్టీలో చురుకుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సీనియర్ నాయకుడు బడ్నైని బొజ్జన్న ను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొంటుందని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహన కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ అన్నారు. పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవారపల్లిలో బుధవారం ఆయన్ను పరామర్శించి బొజ్జన్నకు రెండు కళ్ళు కంటిచూపు ఒకేసారి పోవడం బాధాకరంగా ఉందని బొజ్జన్న కు ఇల జరగడంతో గత నాలుగేళ్లుగా దేవరపల్లి గ్రామంలోనే వుంటున్నారన్నారు. గతంలో దేవారపల్లి గ్రామం నుంచి పాడేరు మండలానికి ఎంపీపీ గా చెయ్యటానికి ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి బొజ్జన్న అని ఆయన గుర్తు చేశారు. వృద్ధాఫూ పింఛను వస్తుంది.అయితే వికలాంగు పింఛను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరుతున్నామని అన్నారు. పార్టీ శ్రేణులందరు బొజ్జన్న కు అండగా ఉండాలని ఆయన కోరారు.యూనిట్ ఇంచార్జ్ లు తామర మూర్తిబాబు, కొంతెలి వెంకట ప్రసాద్ లు పాల్గొన్నారు.
