రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్టు తరపున ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. 30వ డివిజన్ చర్చిపేటకు చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త ఈతలపాక డేవిడ్ రాజు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుసుకుని ఎమ్మెల్యే స్వయంగా ముందుకు వచ్చి అవసరమైన సహాయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే భవానీ చారిటబుల్ ట్రస్టును స్థాపించామని చెప్పారు.
ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, మందుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భవానీ ట్రస్టు ద్వారా పేద కుటుంబానికి అండ
RELATED ARTICLES
