నిలుపు చేసిన జడ్పీ చైర్మన్
విశాఖ కేజీహెచ్ లో ఎస్టి సెల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులను అల్లూరి జిల్లాకు ఆకస్మిక బదిలీ చేయాలని సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కార్యవర్గం విశాఖ పట్నం జడ్పీ ఛైర్మన్ జల్లి శుభద్ర ని కలసి ఎస్టీ సెల్ విభాగం సేవల ప్రాముఖ్యతని, ఆదివాసీ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం వచ్చే అమాయక ప్రజల అవసరాలను వివరించారు. ఇక్కడ జస్టిస్ సెల్ విభాగంలో సిబ్బందిని యధాతథంగా కొనసాగించి మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు.వెంటనే జడ్పీ ఛైర్మన్ ఏ ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారిని ఫోన్ చేసి ఒప్పించి ఉద్యోగుల ఆకస్మిక బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు.ఈ సందర్భంగా సంఘం అద్యక్ష, ప్రధాన కార్యదర్శి సోనయీ అప్పలరాజు, కటారి శోభన్ కుమార్ తో పాటు పలువురు ఎస్. టి సెల్ ఉద్యోగులు సంధ్యా ఉద్యోగులు జడ్పి ఛైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
