Wednesday, February 11, 2026
HomeNewsవిద్యార్థులు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి - ఐటిడిఏ పివో తిరుమణి శ్రీ పూజ

విద్యార్థులు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి – ఐటిడిఏ పివో తిరుమణి శ్రీ పూజ

భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి

-ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పివో తిరుమణి శ్రీ పూజ

ఏ ఎస్ ఆర్ జిల్లా(పాడేరు)జయజయహే  : భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాల విద్యా శాఖ అధ్యర్యంలో పాఠశాల విద్యార్థుల శాసనసభ నమూనా సమావేశంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పివో తిరుమణి శ్రీ పూజ ప్రశంసా పత్రాలు అందజేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మూడు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాసనసభ నమూనా సమావేశంలో భాగంగా వ్యాచరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి నియోజకవర్గం వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి మూడు నియోజకవర్గం పరిధిలో ప్రధమ స్థానం పొందిన ముగ్గురు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి , సమక్షంలో మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం దక్కిందని, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు , పాడేరు ప్రభుత్వం ఉన్నత పాఠశాల సోషల్ అసిస్టెంట్ సూర్యకుమారి పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments