టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేశ జన్మదిన వేడుకలు మార్తాడు గ్రామంలో లో కార్యకర్తలు, అభిమానులు మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ తన సత్తా ఏమిటో చాటారన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ ఎన్నో సంస్కరణలు చేపట్టారని అలాగే ప్రజాదర్బార్ చేపట్టి ప్రజల నుండి విజ్ఞాపనలు తీసుకోవడమే కాకుండా అవి ఎంత వరకు పరిష్కారమయ్యాయో నిరంతరం తెలుసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. రేపటి సమాజాన్ని
తీర్చిదిద్దేది బడి. అటువంటి బడి నిర్వహణ విద్యాశాఖ చేతిలో ఉంటుంది. ఒక ఉన్నత విద్యావంతుడు విద్యా మంత్రి అయితే ఆ శాఖకు ఎంతటి మేలు జరుగుతుందో మంత్రి లోకేష్ చేసి చూపించారని కొనియాడారు. విద్యతో పాటు ఐటీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ లోకేశ్ గ్లోబల్ స్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. లోకేశ్ రాజకీయాల్లో తండ్రి చంద్రబాబు నాయుడికి తగ్గ తనయుడిగా రాష్ట్ర భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఉపాధ్యాయ లోటును గణనీయంగా తగ్గించారని, యువతను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యువగళం స్ఫూర్తితో అభివృద్ధి బాటలో రాష్ట్రం
RELATED ARTICLES
