ఆధునిక సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక ధార్మిక కార్యక్రమాలు ఉచితంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళలను ఆధ్యాత్మిక ప్రపంచం వైపు నడిపిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తమ వంతు కృషి చేస్తున్న శ్రీ వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గురజాడ కళాక్షేత్రం మార్చ్ 9వ తారీఖున నిర్వహించే శ్రీనివాస కళ్యాణo మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను నేడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ చేతుల మీదుగా మరియు
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మేయర్ శ్రీనివాస చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తో పాటు ప్రతిభావంతులైన మహిళలకు ప్రతిభా పురస్కారాలు మహిళలకు విభిన్న సాంప్రదాయ పోటీలు ఉచిత బహుమతులు కూడా ఉంటాయని ఈ సందర్భంగా అన్నమాచార్య సేవ ట్రస్ట్ చీఫ్ డైరెక్టర్ సునీత కొటారి తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మానేపల్లి లక్ష్మీ, పలివెల విజయ పాల్గొన్నారు

