Home Politics Andhra Pradesh ఘనంగా శ్రీ వాసవి ఆత్మార్పణ దినోత్సవం

ఘనంగా శ్రీ వాసవి ఆత్మార్పణ దినోత్సవం

0

దంపతులతో కలస పూజ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చోడవరం వాసవి యూత్ కుల ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారి దేవాలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 150 మంది దంపతులతో 102 కలశాలతో పాలాభిషేకం నిర్వహించారు. ఆలయంలో దేవతామూర్తులకు విశేష పూలంగి అలంకరణలు శ్రీ సూక్తం పూర్వక పంచామృత సహిత కుంకుమ అభిషేకములు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్, పూసర్ల వెంకట రమణ మూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ కలగళ్ల శేషగిరిరావు,క్యాబినెట్ సెక్రెటరీ పసుమర్తి మల్లికార్జున రావు, క్యాబినెట్ ట్రెజరర్ సత్యవరపు శ్రీనివాసరావు హాజరవుగా,పెన్నం రాజు, ఉప్పల చిన్న రాజలింగం గుప్తా, నాలం మూర్తి, పూసర్ల కిరణ్, డిస్టిక్ ఇంచార్జ్ కొల్లూరు మణికుమార్, విశాఖ ఇన్చార్జ్ బత్తుల శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు కేతవరపు రామకృష్ణ, సెక్రటరీ పి.నాగేశ్వరరావు, ట్రెజరర్ ఎం. హరికుమార్,సంఘం పూర్వపు అధ్యక్ష కార్యదర్శులు పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version