Home Politics Andhra Pradesh విద్యార్థులకు సెల్ఫీ భీ పోటీలు

విద్యార్థులకు సెల్ఫీ భీ పోటీలు

0

రోలుగుంట మండలంలో గల అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మంగళవారం మండల స్థాయి స్పెల్ బీ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలు మొత్తం మూడు లెవెల్స్లో, అలాగే మూడు రౌండ్లుగా నిర్వహించగా, మొదటి రౌండ్ – స్పెల్లింగ, రెండవ రౌండ్ – మీనింగ్ అండ్ యూసేజ్,మూడవ రౌండ్ రీడింగ్ లో నిర్వహించారు.
మండలంలోని ప్రతి పాఠశాల నుండి 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక విద్యార్థి చొప్పున ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతి తరగతికి ఒక విద్యార్థిని ఎంపిక చేసి, వారిని జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ మూర్తి , సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయులు కనకరాజు మాస్టారు, సీఆర్‌పి సతీష్ , మండలంలోని అందరు ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version