Home Uncategorized ప్రేమసదన్ మందిరంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

ప్రేమసదన్ మందిరంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

0

శ్రీరామనవమి సందర్భంగా విశాఖ ఎంవీపీలోని శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయీ సేవా సంస్థల సిటీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పవిత్ర కల్యాణోత్సవంలో పలువురు మంది భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా శ్రీ సత్యసాయీ సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాల కోఆర్డినేటర్ ఎం ఎస్ ప్రకాశరావు, సిటీ సేవా సమితి కన్వీనర్ బి. సాయి కుమార్ దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన భజన కార్యక్రమంలో సిటీ సమితి గాయని గాయకులు తమ భక్తి గీతాలతో భక్తులను ఆధ్యాత్మిక మాధుర్యంలో ముంచెత్తారు. ఈ కార్యక్రమం భక్తి, శాంతి, సౌహార్దతను ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version