మాడుగుల మండలం కింతలి గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం పెద్ద ఎత్తున గ్రామంలో సీతారాములకి సారే సమర్పించారు. భక్తులు వివిధ రకాల పిండి వంటలను ఇంటిలో తయారుచేసి గ్రామంలో ఊరేగించి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా పల్లకి ఊరేగింపు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించారు. మండలంలో గల గాదిరాయి సత్యవరం జంపిన ఒమ్మలి తదితరు గ్రామాల్లో కూడా శ్రీరామ నవమీ వేడుకలు ఘనంగా నిర్వహించారు లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాడుగుల మండలం ఎం రామచంద్రపురం గిరిజన గ్రామాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. అలాగే కేజీపురం రామాలయంలోనూ వీరవిల్లి రామాలయంలోనూ ఏం కోటపాడు రామాలయంలోనూ ముకుందపురం, వండర్లపాలెం రామాలయంలో కూడా శ్రీరామనవమి వేడుకలు ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
