Home Politics Andhra Pradesh ఘనంగా కొత్తూరు రచయితల వేదిక కవిసమ్మేళనం

ఘనంగా కొత్తూరు రచయితల వేదిక కవిసమ్మేళనం

0

కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో 12 నెల సమావేశం నిర్వహించినట్లు వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సభ్యులంతా తమ కవితలను వినిపించారు.
అధ్యక్షులు కలమట శ్రీరాములు జైశ్రీరామ్, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి ఉగాది ఉత్సవం, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి కష్టజీవి కవి, గౌరవాధ్యక్షులు పెధ్ధిన కులశేఖర ఆల్వార్ నైతిక విలువలు, కార్యవర్గ సభ్యులు అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్ మధురం మనదేశం, బాణాల రమణమూర్తి దేశాల మధ్య యుద్ధాలా? అను కవితలను వినిపించి కవి సమ్మేళనాన్ని రంజింపజేసారు.
అనంతరం కవులందరికీ గౌరవ సత్కారాలు జరిగాయి. గతేడాది ఏప్రిల్ ఇరువది నాలుగున స్థాపించి, తొలి కవి సమ్మేళనంతో ప్రారంభమైన ఈ కొత్తూరు రచయితల వేదిక, నేడు దిగ్విజయంగా 12 వ నెలవారీ సమావేశం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. 12 వ కవి సమ్మేళనం జరుపుకుని నేడు ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం పట్ల తమకెంతో గర్వకారణంగా ఉందని ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి అన్నారు. కొరవే పురస్కారాలంటూ ఇటీవల ఎనిమిది మందికి ప్రదానం గావించిన చరిత్ర కొత్తూరు రచయితల వేదిక సొంతమని గౌరవాధ్యక్షులు పెధ్ధిన కులశేఖర ఆల్వార్ అన్నారు. కొత్తూరు కవనం అనే ముప్పది కవితల పుస్తకాలను సాహిత్య లోకానికి అందించిన వైనం కొరవే మరో ఘనత అని కార్యవర్గ సభ్యులు అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్ అన్నారు.
కొరవే సభ్యులం అయ్యాక వివిధ పత్రికల్లో తమ తమ రచనలు ప్రచురణ ఎంపికై, సామాజిక బాధ్యతను నిర్దేశించడం జరుగుతుందని ఇది గొప్ప శుభ పరిణామమని సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి అన్నారు.
అనంతరం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలను పంచుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version