Home Uncategorized అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

0

ఊరంతా భక్తి పరవశం

శ్రీరామనవమి సందర్భంగా లోలూరు గ్రామంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వేద పండితులు హరినాథ్, మోహన్ స్వామి ఆధ్వర్యంలో బాజా భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా జరిపారు.
ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కనులార తిలకించారు.
సాయంత్రం ఆంజనేయ స్వామివారిని ఎడ్ల బండిపై ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి కొండయ్య, అనంత చౌదరి, కరణం ఓబులేష్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version