Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshక్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలు..

క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలు..

శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో సిరి వెంకటేశ్వర డెవలోపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె రాజు దంపతులు, సుదర్శన రాజు దంపతులు, మరియు క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు దంపతులు, సుదర్శన రాజు దంపతులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కల్యాణమహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కె.కె రాజు మీడియాతో మాట్లాడుతూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు,ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర మూర్తుల వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో విశేషమని పేర్కొన్నారు.
ఈ కల్యాణ మహోత్సవంలో
క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ తిరుపతి రాజు,ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,యన్.శ్రీనివాసరాజు,విసి జి.యస్.యన్ రాజు,యం.ఆర్.కె రాజు,సి.హెచ్ వెంకటపతిరాజు,క్షత్రియ సంక్షేమ సమితి పెద్దలు,యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments