Saturday, April 18, 2026
HomeNewsఇల్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయండి

ఇల్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయండి

హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల

విజయవాడ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం గంగవరంలో మంగళవారం బోర్డ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు తో కలిసి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తూ..
కూటమి ప్రభుత్వం గృహనిర్మాణ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో నిరాశ్రయులైన పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో 2029 నాటికి 17 లక్షల పక్కా గృహాలను పూర్తి చేయడం ప్రధాన ఎజెండా గా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను నాణ్యతతో కట్టడాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments