Home News ప్రజల సమస్యల పరిష్కారమే మా తొలి ప్రాధాన్యత – ⁠ఎమ్మెల్యే సుందరపు

ప్రజల సమస్యల పరిష్కారమే మా తొలి ప్రాధాన్యత – ⁠ఎమ్మెల్యే సుందరపు

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే తమ తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పది మంది బాధిత కుటుంబ సభ్యులకు సీఎం సహాయనిధి కింద రూ. 3.50 లక్షలు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version