Home News యలమంచిలి పట్టణంలో ఘనంగా సంవిధాన్ దివస్

యలమంచిలి పట్టణంలో ఘనంగా సంవిధాన్ దివస్

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : స్థానిక నెహ్రూ నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వదేశీ జాగరణ జిల్లా కన్వీనర్ పప్పు ఈశ్వరరావు అధ్యక్షతన సంవిదాన్ దివస్ ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను స్మరించుకుంటూ, ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న దినంగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవంగా జరుపుకోవడం ఎంత ప్రధానమో తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాజీ జడ్పీటీసీ ఆడారి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ మల్ల కొండ బాబు, దళిత మోర్చా నాయకులు దుగుపాటి సూరిబాబు, దుగుమాటి శ్రీను, బిజెపి సీనియర్ నాయకులు నక్క శివశంకర్, మార్కెట్ కమిటీ సభ్యుడు పిట్ట దాసుబాబు, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు నెలిముకి లక్ష్మణరావు, తెరపల్లి అప్పలరాజు, యలమంచిలి రూరల్ మండల అధ్యక్షులు కుమార్ స్వామి, పందురు సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version