Home Politics Andhra Pradesh రాజమండ్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

రాజమండ్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

0

రాజమండ్రి సిటీ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు.
కార్యక్రమానికి పార్టీ సి.ఈ.సి సభ్యులు, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వేడుకల ప్రారంభంలో లక్ష్మివారపుపేటలో నిర్వహించిన సోమాలమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న భరత్, పార్టీ నాయకులు మహాలక్ష్మి వారి మిత్రబృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పండితుడు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు, పంచాంగ శ్రవణం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన భరత్, కొత్త తెలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగి ప్రజలకు మేలు చేసే విధంగా పాలన సాగించాలని కోరారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో లడ్డూ కల్తీ, పాల కల్తీ, అక్రమ మద్యం వ్యాపారం, అక్రమ కట్టడాలు వంటి అంశాలు పెరిగి ప్రజాకంటక పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
అదేవిధంగా ఉగాది సందర్భంగా కార్యకర్తలకు తొలి విడతగా బీమా పత్రాలను భరత్ అందజేశారు. త్వరలోనే అందరికీ బీమా పత్రాలు అందించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version