Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshఫిర్యాదు దారులను కూర్చోబెట్టి సమస్య వినండి...!

ఫిర్యాదు దారులను కూర్చోబెట్టి సమస్య వినండి…!

పెందుర్తి పోలీసులకు సీపీ సూచన

నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి గురువారం పెందుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించారు. స్టేషన్ ఆనుకొని ఉన్న ఖాళీ ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రము చేయించాలని ఆదేశించారు. మరుగుదొడ్లను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, స్టేషన్ నందు ఎల్లవేళలా తగు సిబ్బంది అందుబాటులో ఉండాలనీ ఆదేశించారు. పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలన్నారు. అన్ని రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని, స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో స్పందిస్తున్న తీరు తెలుసుకొని , ఫిర్యాదుదారులకు మర్యాద ఇస్తూ వారి సమస్యలను కూర్చోబెట్టి వినాలని, వాటిని పారదర్శకముగా విచారణ చేసి త్వరితగతిన పరిష్కారించాలని తెలిపారు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ యొక్క ప్రతి కదలిక ఎల్లవేళలా పరిశీలించాలనీ, గంజాయి రవాణాదారులను అరెస్టు చేయాలనీ, స్టేషన్ల పరిధిలో ఒక్క గంజాయి పెడ్లర్ కూడా ఉండరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశారు, విధులలో ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. స్టేషన్ సీఐ సతీష్ కుమార్,ఎస్ ఐ, పోలీసులు సీపీ వెంట వున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments